సిటీబ్యూరో: 200 ఏండ్ల సజీవ చరిత్ర..ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపు కలిగిన సికింద్రాబాద్ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. సోమవారం ఎక్స్ వేదికగా పునర్వ్యవస్థీకరణ ముసుగులో కాంగ్రెస్ సర్కారు చరిత్రను చెరిపివేసి, సాంస్కృతిక విధ్వంసానికి జరుగుతున్న కుట్రలపై ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మీ ఇష్టానుసారం మార్చే హక్కు మీకు లేదు.
మల్కాజిగిరి ఎంపీగా గెలిచినంత మాత్రాన, మల్కాజిగిరి పేరుతో ప్రత్యేక ఎంసీహెచ్ ఏర్పాటు చేసి, చారిత్రక సరిహద్దులను బలవంతంగా మింగేయడం సరికాదు. హైదరాబాద్కు ట్విన్ సిటీగా గర్వంగా భుజం భుజం కలిపి నిలిచింది. పాలన సౌలభ్యం నెపంతో తరతరాల చరిత్రను కాలరాయడం ఎప్పటికీ సమర్థనీయం కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని పేర్కొన్నారు.