Kiran Abbavaram | ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు నటుడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా అనంతరం ఎస్ ఆర్ కళ్యాణ మండపం, రూల్స్ రంజన్ అంటూ వరుస సినిమాలు చేశాడు. ఇక రీసెంట్గా పెళ్లి చేసుకున్న ఇతడు గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చాలా రోజులకు తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు కిరణ్. నేడు తన బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న మూవీని అనౌన్స్ చేశాడు. కిరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘క’ (KA). ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు టీజర్ విడుదల చేశారు.
ఎవరు నువ్వు.. ఎక్కడి నుంచి వచ్చావు. పక్కా వాళ్ల ఉత్తరాలు ఎందుకు చదువుతున్నావు.. నీకంటూ ఎవరు లేరా అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇక టీజర్ చూస్తే.. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మాన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అతడితో టైం మిషన్ లా ఉన్న ఎదో తెలియాని శక్తి మాట్లాడుతున్నట్లు టీజర్లో చూపించారు. ఇక ఈ మూవీ స్టోరీ రివీల్ చేయకుండా యాక్షన్ ప్యాక్డ్గా ఉంది ఈ టీజర్. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read..