ఎంపీ విజయసాయితో నాకు సంబంధం లేదు.. ప్రెగ్నెన్సీ వార్తలపై దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ వివరణ
భర్త విదేశాల్లో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందనే వార్త రెండు రోజులుగా ఏపీలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
భర్త విదేశాల్లో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందనే వార్త రెండు రోజులుగా ఏపీలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కె.శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మదన్మోహన్ మానిపాటితో 2013లో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని కె.శాంతి తెలిపారు. ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయ ప్రకారం 2016లోనే విడాకులు తీసుకున్నానని పేర్కొన్నారు. 2020లో న్యాయవాది సుభాష్‌ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఒక బిడ్డను కన్నానని చెప్పారు. మరొకరి భార్యను అని తెలిసి కూడా మదన్మోహన్ తనను తీవ్రంగా వేధించాడని, కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను వైజాగ్‌లోనే చూశానని.. ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని కె.శాంతి తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతున్నారని.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి సిగ్గులేదా? ఆయన వయసుకు అయినా గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒకవేళ నేను చనిపోతే నాపై ఆరోపణలు చేసిన వారే నా చావుకు కారణమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని.. దయచేసి ఆయనతో తనకు సంబంధం అంటగట్టకండి అని విజ్ఞప్తి చేశారు.
తన సస్పెన్షన్ అంశంపై కూడా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి స్పందించారు. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రచారాన్ని కె.శాంతి ఖండించారు. గిరిజన మహిళ కాబట్టే తనను వేధిస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

