ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఢిల్లీ సుందరి తాప్సీ. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా పలు సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్ల నుంచి తన ఫోకస్ అంతా హిందీ సినిమాలపైనే పెట్టింది. గ్లామర్ పాత్రలతోపాటు డీగ్లామరైజ్ డ్ రోల్స్ లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. కొన్నాళ్లుగా మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ కోచ్ మథియాస్ బోయెతో డేటింగ్ లో ఉంది తాప్సీ. అయితే చాలా రోజుల తర్వాత తాప్సీ నోట పెళ్లికి సంబంధించిన మాట వచ్చింది.
ఇంతకీ ఈ బ్యూటీ ఇప్పట్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుందా..? లేదా అని చెవులు కొరుక్కుంటున్న చాలా మందికి క్లారిటీ ఇచ్చింది. మా అమ్మానాన్న ఒకే చెప్పకుండా నేను ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. అది నేను డేటింగ్ లో ఉన్నవారైనా..వివాహం గురించి ఆలోచిస్తున్నవారైనా..పేరెంట్స్ ఆమోదం ఉండాల్సిందే. నా విలువైన సమయాన్ని భవిష్యత్ ఉందనిపించిన రిలేషన్షిప్ కు కేటాయిస్తా..కానీ టైం పాస్ కోసం రిలేషన్ షిప్ మెయింటైన్ చేయను. తాను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని, ఒక్కోసారి తానిక పెళ్లి చేసుకోనేమో అని వాళ్లు బాధపడుతున్నారని చెప్పింది.
వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా ప్రొషెషనల్ లైఫ్ లో ఇంకా బెంచ్‌మార్క్‌ను చేరుకోలేదు. ఎప్పుడైతే నాకు ఆ భావన కలుగుతుందో అప్పటి నుంచి సినిమాలు తగ్గించి..ఆరు సినిమాలకు రెండుమూడు సినిమాలు మాత్రమే చేస్తాను. అప్పుడు మాత్రమే నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే సమయం దొరుకుతుందని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను.
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?