SP Bala Subrahmanyam | కేరళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. సంగీత దిగ్గజానికి ఘన నివాళి
SP Bala Subrahmanyam | భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో దశాబ్దాల పాటు అలరించిన గాన గంధర్వుడు S. P. బాలసుబ్రహ్మణ్యంకు కేరళలో అరుదైన గౌరవం దక్కింది. పాలక్కాడ్లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విశేషంగా జరిగింది. సంగీతానికి భాషా, ప్రాంతీయ భేదాలు లేవని మరోసారి కేరళ ప్రజలు నిరూపించారు
SP Bala Subrahmanyam | భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో దశాబ్దాల పాటు అలరించిన గాన గంధర్వుడు S. P. బాలసుబ్రహ్మణ్యంకు కేరళలో అరుదైన గౌరవం దక్కింది. పాలక్కాడ్లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విశేషంగా జరిగింది. సంగీతానికి భాషా, ప్రాంతీయ భేదాలు లేవని మరోసారి కేరళ ప్రజలు నిరూపించారు. పరభాషా గాయకుడైనప్పటికీ ఎస్పీబీపై తమకున్న అపారమైన అభిమానాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా తెలియజేశారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ రూపొందించిన ఈ విగ్రహం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ కార్యక్రమంలో ఎస్పీబీ తనయుడు చరణ్తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనోజ్, చిత్ర, హరిహరన్, సుజాత్ మోహన్, ఉన్ని మీనన్, విజయ్ ఏసుదాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “సంగీత మేఘం” పేరిట ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించి, ఎస్పీబీకి గాన నివాళి అర్పించారు. పలువురు ప్రముఖ గాయకులు ఆయన పాటలను ఆలపిస్తూ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. గతంలో హైదరాబాద్లో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.రవీంద్ర భారతిలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో ప్రాంతీయ వివాదాలు తలెత్తాయి. అయితే కేరళలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఘనంగా కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగానే కాకుండా, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడిగానూ విశేష సేవలు అందించారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారు. మలయాళంలోనూ ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడారు. 2020 సెప్టెంబర్ 25న కరోనా కారణంగా ఆయన కన్నుమూసినా, తన అమర గానంతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేరళలో విగ్రహావిష్కరణతో ఆయనకు మరొక చిరస్మరణీయ గౌరవం దక్కిందని అభిమానులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

