Sree Vishnu | కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం స్వాగ్ (SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ, దక్షా నగార్కర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది స్వాగ్ టీం. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు శ్రీవిష్ణు.
స్వాగ్ అంటే అర్థమేంటి..?
స్వాగ్ అంటే స్వాగణిక కుటుంబంలోకి స్వాగతం అని అర్థం. పెద్ద టైటిల్‌కు బదులుగా ఈ చిన్న టైటిల్‌ను ఎంపిక చేశాం. 15వ శతాబ్ధ కాలంలో స్వాగణిక కుటుంబంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం మధ్య నెలకొన్న సంఘర్షణల చుట్టూ సినిమా సాగుతుంది. పురుషులు గొప్పా..మహిళలా..? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనంతో కూడిన కథనాలు ఆదిస్తారనే ధృడ నమ్మకంతో ఈ కథను సిద్దం చేశారు.
సినిమాలో మీ పాత్రేంటి..?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపిస్తా. ఈ పాత్రలన్నీ సవాలుతో కూడుకున్నవి.. అయినప్పటికీ చాలా అందంగా వచ్చాయి. చిన్నా పెద్దా అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుంది.
రీతూ వర్మ పాత్ర గురించి..
రీతూ వర్మ పాత్ర సినిమా అంతా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంటుంది. ఈ పాత్ర ప్రేక్షకులపై.. ప్రత్యేకించి మహిళలపై శాశ్వత ముద్ర వేస్తుంది.
ఏ పాత్ర చేయడం కష్టమనిపించింది..?
సింగ పాత్ర చాలా ఈజీగా అనిపించింది. మిగిలిన మూడు పాత్రలు వాటి యూనిక్ గెటప్, డైలాగ్ డెలివరీలతో ఛాలెంజింగ్‌గా అనిపించాయి. స్వాగ్ నాలుగు తరాలను చూపిస్తుంది. ప్రేక్షకులను అయోమయంలో పడేయకుండా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా సాగుతూ సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుంది.
మీ కొత్త సినిమాలు..
గీతా ఆర్ట్స్ బ్యానర్లో థ్రిల్లర్ సినిమాతోపాటు ఎంటర్టైనర్ కూడా చేయబోతున్నా.
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్