3 BHK | ‘సూర్యవంశం’ సినిమాలోని ఐకానిక్ సన్నివేశాన్ని మళ్లీ రీ క్రియేట్ చేశారు నటుడు శరత్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సూర్యవంశం. దేవయాని, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 1997లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేశ్, బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ రీమేక్ చేసి సూపర్ హిట్‌ని అందుకున్నారు. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీతో కలిసి గ్రూప్ ఫొటో దిగే ఐకానిక్ సన్నివేశం ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సన్నివేశాన్ని మళ్లీ రీ క్రియేట్ చేశారు.
సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తుండగా.. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్, చైత్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ తండ్రిగా కనిపించబోతున్నాడు శరత్ కుమార్. జులై 4న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గోంది చిత్రయూనిట్. అయిదే ఇదే ఈవెంట్లో తన సినిమా ఐకానిక్ సీన్‌ని మళ్లీ రీక్రియేట్ చేశారు శరత్ కుమార్, నటుడు సిద్దార్థ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనడానికి పడే పాట్లను, వారి కలలను ఆవిష్కరించే భావోద్వేగభరితమైన కుటుంబ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.
Suryavamsam recreation! 😂pic.twitter.com/G2BJmOZNwa
— Films and Stuffs (@filmsandstuffs) June 27, 2025
Read More