Tenth Results | హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. బాలికలు 77.08 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 71.05 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో జనగామ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. సంగారెడ్డి 55.90 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 42,834 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 38,741 మంది హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ చేయించాలకునే వారు ప్రతి సబ్జెక్ట్‌కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితే ప్రతి పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించాలి. జులై 7వ తేదీ లోపు సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.