Water shortage | కామారెడ్డి : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన కాలనీవాసులు శుక్రవారం ఖాళీ బిందెలతో ప్రదర్శన చేశారు.
రెండు నెలల నుండి సిబ్బందికి తెలియజేసినప్పటికీ నామమాత్రంగానే స్పందిస్తున్నారే తప్ప నీటి కటకట ను తొలగించట్లేదు. ఉద్యోగస్తులకు, రోజూ వారి పని చేసుకునే వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటర్ ట్యాంక్ లో నీరు పుష్కలంగా ఉన్నా సిబ్బందికి నీళ్లు పెట్టరాకపోవడంతో అపార్ట్మెంట్లకు నీళ్లు రావట్లేదు. గృహిణిలు,గర్భిణీలు సమస్యలేదుర్కుకొంటున్నామని వాపోయారు. అనంతరం గ్రామపంచాయతీ సెక్రటరీ రాజేందర్ కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.