తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కోలీవుడ్ (Kollywood ) స్టార్ హీరో (Suriya) సూర్య స్పెషల్ వీడియో ట్విటర్లో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. బ్లూ బనియన్, బ్లాక్ షార్ట్స్ లో ఉన్న ఈ జై భీమ్ యాక్టర్ చెట్ల మధ్యలో ఉన్న వన్ వే రోడ్డు వెంబడి కోడె (Ox) ను పట్టుకుని నడుచుకుంటూ వస్తూ..అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు (Tamil New Year) చెప్పాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్చేస్తోంది.
వెట్రిమారన్ డైరెక్షన్లో జల్లికట్టు నేపథ్యంతో రాబోతున్న వాడివాసల్ (Suriya) సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో బుల్ ఫైట్, కామన్ మ్యాన్‌కు మధ్య రిలేషన్‌షిప్‌ను చూపించబోతున్నాడు డైరెక్టర్ వెట్రిమారన్. సీఎస్ చెల్లప్ప తమిళ పుస్తకం ఆధారంగా వస్తోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సోదరసోదరీమణులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని తమిళ్లో ట్వీట్ చేశాడు రాంచరణ్.
அனைவருக்கும் எனது தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள் ❤️#Suriya #VaadiVaasal #TamilNewYear2022 pic.twitter.com/KdIYM8Ngcc
— Sreedhar Marati (@SreedharSri4u) April 14, 2022
తమిళ స్టార్ డైరెక్టర్ బాలాతో సూర్య 41వచిత్రాన్ని చేస్తున్నాడు. దీంతోపాటు మాధవన్ తెరకెక్కిస్తున్న రాకెట్రీ..ది నంబియార్ ఎఫెక్ట్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.