Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
కంగువ రెండు పార్టులుగా రానుండగా.. పార్టు 1 నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది సూర్య టీం. కంగువను నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయనుందని తెలిసిందే. తాజాగా ఓవర్సీస్లో రిలీజ్ చేస్తుందెవరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars విడుదల చేస్తుంది.
మొత్తానికి సూర్య మేనియా ఓవర్సీస్లో ఎలా ఉండబోతుందో తాజా అప్డేట్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
NTRNeel | ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే.?