Suriya 45 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya)బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 (Suriya 44) చేస్తున్నాడు. మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే వార్తను షేర్ చేశాడు ఆర్జే బాలాజీ (RJ Balaji).
చిట్ చాట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌లోని కోర్ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం చాలా మార్పులు చేశామన్నాడు. అంతేకాదు సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశాం. అధికారికంగా ప్రకటించే వరకు టైటిల్‌ను చెప్పొద్దని వలైపెచ్చు (ఫిల్మ్ క్రిటిక్)సార్‌ను రిక్వెస్ట్ చేస్తున్నానన్నాడు. సరైన సమయం రాగానే అధికారికంగా ప్రకటిస్తామన్నాడు.
ఒక గంటపాటు నెరెషన్ అయిపోయాక.. 16 ఏండ్ల తర్వాత ఫస్ట్ నెరెషన్లోనే నేను సినిమాకు ఒకే చెప్పడం ఇదే మొదటిసారి అని సూర్య సార్ అన్నారు. ఇందులో థ్రియాట్రికల్ మూమెంట్స్ ఉన్నాయన్నారు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 24 మూవీ తర్వాత సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న మరో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
“#Suriya45 title is already finalized. I request Valaipechu to not reveal it, until it becomes official😂”#Suriya | #RJBalaji | #ARRahman pic.twitter.com/9wiu8O8LwH
— AmuthaBharathi (@CinemaWithAB) November 17, 2024
#Suriya45 – Looks like #Suriya & #ARRahman got very much impressed with the script and #RJBalaji also sounds very confident about it..✌️💥 Waiting for this one..🤝 pic.twitter.com/X7Rtmga8HD
— Laxmi Kanth (@iammoviebuff007) November 17, 2024
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్