కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya), మాస్ డైరెక్టర్ శివ (Siva) కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో సూర్య 42 (Suriya 42)గా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. కాగా ఇపుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఇవాళ మొదలైంది.
గోవా (Goa Shoot) లో ఈ షెడ్యూల్ షురూ అయింది. ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న బాలీవుడ్ భామ దిశాపటానీ లేటెస్ట్ షెడ్యూల్లో జాయిన్ కాగా..శివ టీం కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. సూర్య 42 ప్రాజెక్టును 10 భాషల్లో విడుదల చేయడంతోపాటు 3డీ ఫార్మాట్లో కూడా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్..కాగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సూర్య మరోవైపు వనంగాన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు సూరారై పోట్రు హిందీ వెర్షన్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.