దూకుడు, బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి వరస విజయాలతో దూసుకుపోతున్న మహేశ్‌బాబు కెరీర్లో అనుకోని అడ్డంకి నేనొక్కడినే. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ విజయం మాత్రం సాధించలేదు. అలాంటి సమయంలో కొరటాల శివ చెప్పిన కథ నచ్చి శ్రీమంతుడు సినిమా చేశాడు మహేశ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 2015 ఆగస్ట్ 7న మహేశ్ బాబు బర్త్ డేకు రెండు రోజుల ముందు విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ఊరు దత్తత అనే కాన్సెప్టుతో కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమాకు ప్రశంసలతో పాటు పైసలు కూడా బాగానే వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన వసూళ్లు ఒక్కసారి చూద్దాం..
నైజాం: 22.34 కోట్లు
సీడెడ్: 9.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 6.12 కోట్లు
ఈస్ట్: 5.63 కోట్లు
వెస్ట్: 4.37 కోట్లు
గుంటూరు: 5.75 కోట్లు
కృష్ణా: 4.37 కోట్లు
నెల్లూరు: 2.19 కోట్లు
ఏపీ + తెలంగాణ: 60.17 కోట్లు
కర్ణాటక + తమిళనాడు + రెస్ట్ ఆఫ్ ఇండియా: 9.14 కోట్లు
ఓవర్సీస్: 12.50 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్: 2.29 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాండ్ టోటల్: 85.20 కోట్లు షేర్
శ్రీమంతుడు సినిమాను అప్పట్లో రూ.75 కోట్లకు అమ్మారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.85 కోట్లకు పైగా వసూలు చేసి రూ.10 కోట్లకు పైగానే లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ రేంజ్ మరింత పెరిగిపోయింది. సామాజిక అంశాన్ని తీసుకుని కమర్షియలైజ్ చేసి దాన్ని ప్రేక్షకుల మనసుకు నచ్చేలా తెరకెక్కించడంలో కొరటాల ఆరితేరిపోయాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా