Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). బాబీ (Bobby) దర్శకత్వంలో ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డాకు మహారాజ్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో టికెట్ బుకింగ్ అప్డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్ టికెట్ బుకింగ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ బుకింగ్స్ ఇవాళ మొదలయ్యాయి. పరిమిత షోలతో బుకింగ్స్ మొదలైన గంటలోనే లక్షా 56వేలకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి. బాలకృష్ణ సినిమాకు క్రేజ్ ఎలా ఉందో ఈ వార్త మరోసారి చెప్పేస్తుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. రోనిత్ రాయ్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#Daakumaharaaj Ticket Bookings has begun opening in theaters across Andhra Pradesh, Telangana, and Karnataka Starting Today 🥁🥁
Check your local listings pic.twitter.com/9TvvKHjKCY
— Nandamurifans.com (@Nandamurifans) January 10, 2025
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Sai kumar | మీ ప్రేమకు సదా రుణపడి ఉంటా.. 50 ఏండ్ల సినీ ప్రస్థానంపై సాయికుమార్