Saikumar | నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, నిర్మాతగా దశాబ్ధాలుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సీనియర్ యాక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు సాయికుమార్ (Saikumar). కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా పోలీస్.. ఈ పాపులర్ డైలాగ్ గుర్తుంది కదా.. పోలీస్ స్టోరీ సినిమాలోనిది.
ఈ డైలాగ్‌ను సాయికుమార్ కాకుండా వేరే యాక్టర్ చెబితే అంతగా పాపులర్ అయ్యేది కాదేమో అంటే అతిశయోక్తి కాదు. ఒక్క డైలాగ్‌తో ఇండస్ట్రీని షేక్ చేశాడు సాయికుమార్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇండస్ట్రీలో 50 ఏండ్ల (Saikumar @50 Years) ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. సాయికుమార్ దేవుడు చేసిన పెళ్లి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్కీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 1975 జనవరి 9న (ఇదే రోజు) రిలీజైంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ అరుదైన జ్ఞాపకాన్ని సినీ ప్రేక్షకులు, అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకున్నాడు సాయికుమార్. ఆ సినిమాలోని స్టిల్‌ను షేర్ చేసుకుంటూ అద్బుతమైన ప్రయాణం మొదలై.. కొనసాగుతోంది.. అందరికీ ధన్యవాదాలు అని సందేశాన్ని పోస్ట్ చేశాడు.
50 సంవత్సరాలు.. నా ప్రయాణంలో భాగమైన సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ, నా కుటుంబానికి, నా ప్రేక్షకులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అచంచలమైన ప్రేమ, మద్దతుకు నేను సదా రుణపడి ఉంటానని ట్వీట్ చేశాడు సాయికుమార్. కెరీర్లో ఉత్తమ విలన్ (సామాన్యుడు)గా, ఉత్తమ సహాయనటుడిగా (ప్రస్థానం) అవార్డులు అందుకోవడంతోపాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న సాయికుమార్ మరిన్ని విజయాలు అందుకోవాలని విష్ చేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
It’s 50 years !!
I am deeply grateful to everyone in the film fraternity, my family, and my extended family (the audience) who have been a part of my journey.
I will forever be indebted to your unwavering love and support 💐#Devuduchesinapelli pic.twitter.com/Y2gWsOpLx2
— SaiKumar (@saikumaractor) January 9, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై హైకోర్టులో విచారణ
Shraddha Kapoor | శ్రద్ధాకపూర్ న్యూ హెయిర్ కట్.. కొత్త లుక్ స్పెషలేంటో..?
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి