శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 18:47:17

'హాకీ కోచ్ అంటే షారుక్ అనుకుంటున్న‌రు'..ఏ 1 ఎక్స్‌ప్రెస్ ట్రైల‌ర్

'హాకీ కోచ్ అంటే షారుక్ అనుకుంటున్న‌రు'..ఏ 1 ఎక్స్‌ప్రెస్ ట్రైల‌ర్

టాలెంటెడ్ యాక్ట‌ర్ సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న చిత్రం  'ఏ1 ఎక్స్‌ప్రెస్‌ '‌. హాకీ క్రీడ నేప‌థ్యంలో వ‌స్తోన్న ఈలావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చారిత్రాత్మ‌క ఆట సాక్షిగా ఈ సారి కప్పు మ‌న‌మే కొడుతున్నాం అంటూ సాగే సంభాష‌ణ‌ల‌తో షురూ అయిన ట్రైల‌ర్ హాకీ గేమ్‌, ఫైట్‌, లావ‌ణ్య‌త్రిపాఠి-సందీప్ కిష‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది.


'ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే ఇంకా షారుక్ ఖాన్ అనే అనుకుంటున్నార‌య్యా బాబు అని రావు రమేశ్ మీడియాతో అంటుండ‌గా...మ‌న‌దేశంలో స్పోర్ట్స్‌మెన్స్ కు ఇవ్వాల్సిన‌ క‌నీస గౌర‌వం ఇవ్వ‌ట్లేదు. ఇక్క‌డ స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాల‌మైంది' అని సందీప్ కిష‌న్ చెప్పే డైలాగ్స్ అంద‌రినీ ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది టాలీవుడ్‌లో తెరకెక్కు‌తున్న తొలి హాకీ ఫిల్మ్ కావ‌డం విశేషం. 

ఇవి కూడా చ‌ద‌వండి..

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo