Malli Modalaindi in OTT | కరోనా మళ్లీ పెరగడంతో సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా మరో సినిమా నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల కావడానికి సిద్ధమైంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తున్నది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఈ మేరకు ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
LIFE AFTER DIVORCE Sumanth's ‘#MalliModalaindi’ is going to be released soon on #ZEE5@iSumanth @NainaGtweets @vennelakishore @ZEE5Telugu pic.twitter.com/wlN6iyMRAD
— Maduri Mattaiah (@madurimadhu1) January 20, 2022
విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా మళ్లీ మొదలైంది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణి సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. ఇక జీ5 ఓటీటీలో ఇవాళ ‘లూజర్’ సీజన్ 2 విడుదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి వార్తలు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..