మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..

Krithi Shetty | తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. గతేడాది ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. నాని శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలు అందుకొంది. దాంతో కృతి శెట్టి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఈమె కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ కస్తూరి.
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్.. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తోంది కృతి శెట్టి. ఇక ఇప్పుడు ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె ఓకే చేసే పనిలో పడింది. మరీ ముఖ్యంగా ఈమెకు ఇష్టమైన హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో కృతి శెట్టి మనసు దోచిన ఆ హీరో ఎవరో కాదు.. రామ్ చరణ్. ఉప్పెన సినిమా సమయంలోనే ఈ విషయం గురించి ఓపెన్ అయింది కృతి శెట్టి.
తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అప్పట్లో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి పేరు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు వర్క్ అవుట్ అయింది అంటే కృతి రేంజ్ మారిపోవడం ఖాయం. బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఈజీగా దొరికినట్లే. మరోవైపు మెగా కాంపౌండ్‌లోకి ఒకసారి వస్తే అవకాశాలు కూడా వాటంతట అవే వస్తాయి. మొత్తానికి ఉప్పెన హీరోయిన్ కెరీర్ ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
బంగార్రాజు సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.. కలెక్షన్స్ డ్రాప్..
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
nitish bharadwaj | ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యకు దూరమైన బుల్లితెర కృష్ణుడు..
Krithi Shetty | పింక్ కలర్ లంగా ఓణీలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

