కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..

Krithi shetty favorite Actor | మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ ఒక్క సినిమాతో బేబమ్మగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌లో బోల్డ్ పాత్రలో నటించి యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టి.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్గా మారింది. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె తనకు నచ్చిన హీరో ఎవరు? తనకు ఎన్ని భాషలు వచ్చు? వంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

సంక్రాంతి పండక్కి రిలీజైన బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కృతిశెట్టి తాజాగా ఓ టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. తనకు టాలీవుడ్లో రామ్‌చరణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆమె తెలుగులో చూసిన తొలి సినిమా రంగస్థలం అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రామ్‌చరణ్ నటించిన చాలా సినిమాలను హిందీ డబ్బింగ్ వర్షన్లో చూశానని పేర్కొంది. రామ్‌చరణ్‌తో కలిసి ఒక్కసారైనా నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. ఈ షోలోనే మెగాస్టార్ చిరంజీవిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది కృతిశెట్టి.
తన తొలి సినిమా ఉప్పెన సినిమా చూసి చిరు ఇచ్చిన ప్రశంస ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. ఉప్పెన సినిమా రిలీజయ్యాక ప్రశంసిస్తూ ఒక లెటర్ పంపించారని గుర్తుచేసుకుంది. అది ఆయన స్వయంగా రాశాడని.. ఆ లెటర్లో తనను యు ఆర్ ఎ బోర్న్ స్టార్ అని మెచ్చుకున్నారని తెలిపింది. ఆయన ప్రశంస ఎప్పటికీ గుర్తుండాలని ఆ లెటర్‌ను ఫ్రేమ్ కట్టించుకుని భద్రంగా దాచుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఎన్ని భాషలు వచ్చునో కూడా ఈ షో ద్వారా బయటపెట్టింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తుళు భాషలు వచ్చని చెప్పింది. తమిళం నేర్చుకుంటున్నానని.. కన్నడం అర్థం అవుతుందని పేర్కొంది.
హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు-మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబో లో తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంలో నటిస్తుంది. అంతే కాకుండా రామ్ సరసన ది వారియర్, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజక వర్గం చిత్రాలలో నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
బంగార్రాజు సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.. కలెక్షన్స్ డ్రాప్..
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
nitish bharadwaj | ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యకు దూరమైన బుల్లితెర కృష్ణుడు..
Krithi Shetty | పింక్ కలర్ లంగా ఓణీలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

