బంగార్రాజు సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.. కలెక్షన్స్ డ్రాప్..

Bangarraju four days Collections | అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. నాగార్జున కెరీర్లో ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా సంచలన ఓపెనింగ్స్ తీసుకొచ్చింది బంగార్రాజు. మొదటి మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే నాలుగో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్‌లో మెల్లగా డ్రాప్ కనిపించింది. ఐదో రోజు చాలాచోట్ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించడంతో థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు ఉంచడంతో కలెక్షన్స్‌పై ప్రభావం బాగానే పడింది. ఐదో రోజు ఏపీ, తెలంగాణలో కేవలం 1.94 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. తద్వారా ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో ఐదు రోజుల్లో 27 కోట్ల షేర్ వసూలు చేసింది బంగార్రాజు. ప్రపంచ వ్యాప్తంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే ఇది సరిపోదు. మరో రూ.8 కోట్లు వస్తే గానీ బంగార్రాజు హిట్ అనిపించుకోదు.
కరోనా విజృంభిస్తుండటంతో చాలా చోట్ల ఇప్పటికే కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఓవర్సీస్, కర్ణాటకలో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొదటి మూడు రోజులు పండగ చేసుకున్న బంగార్రాజుకు.. నాలుగో రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. మొదటి మూడు రోజులు క్రేజ్ క్యాష్ చేసుకున్న నాగార్జున.. నాలుగో రోజు నుంచి కష్టపడుతున్నాడు. మరి ఈ సినిమా సేఫ్ అవుతుందా లేదా చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
ఇంట్లో నుంచి వెళ్లి నటి అదృశ్యం.. గోనె సంచిలో మృతదేహం లభ్యం
Krithi Shetty | పింక్ కలర్ లంగా ఓణీలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

