ఇంట్లో నుంచి వెళ్లి నటి అదృశ్యం.. గోనె సంచిలో మృతదేహం లభ్యం

Raima Islam Shimu | బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ నటి రైమా ఇస్లాం షిము హత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె.. ఒక గోనె సంచిలో మృతదేహంగా కనిపించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్‌కు చెందిన నటి రైమా ఇస్లాం షిము 1998లో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. వర్తమాన్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు సుమారు 25 చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా పలు టీవీ సీరియళ్లలో నటించింది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త షెకావత్ అలీ నోబెల్ ఫిర్యాదు మేరకు జనవరి 16న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కెరానిగంజ్ బ్రిడ్జి వద్ద ఒక గోనెసంచిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లి చూసిన పోలీసులు.. బ్యాగులో ఉన్నది నటి రైమాగా గుర్తించారు. అయితే రైమా శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు రైమా భర్త షెకావత్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల విచారణలో రైమా హత్యలో తనకు ప్రమేయం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే రైమాతో ఆమె భర్తకు కొద్దిరోజులుగా గొడవలు నడుస్తున్నాయని.. కుటుంబ కలహాలే రైమా హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
Sankranti movies | సంక్రాంతి విజేత ఎవరు.. బరిలో దిగిన కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
కొత్త మెగాస్టార్ అల్లు అర్జునే.. ఇది కఠిన సత్యం.. ఆర్టీవీ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

