Sankranti movies | సంక్రాంతి విజేత ఎవరు.. బరిలో దిగిన కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?

Sankranti movies | ప్రశ్న సింపుల్‌గా ఉన్న సమాధానం చెప్పడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో అందరి చూపు బంగార్రాజు పైనే ఉంది. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వచ్చిన ఈ సినిమా అనుకున్నట్లుగానే కలెక్షన్ల ప్రవాహం కురిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ పండక్కి బంగార్రాజుతో పాటు మరో మూడు సినిమాలు వచ్చాయి.
జనవరి 14న చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి విడుదలైంది. కొత్త దర్శకుడు పులి వాసు తెరకెక్కించిన ఈ సినిమా కనీసం వచ్చిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే రేసులో కూడా లేకుండా పోయింది సూపర్ మచ్చి. ఇప్పటి వరకు కనీసం 20 లక్షల షేర్ కూడా ఈ సినిమా తీసుకురాలేదు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా పరిచయమైన హీరో సినిమాకు మంచి టాక్ వచ్చింది. కాకపోతే కలెక్షన్స్ మాత్రం రావడం లేదు.
మరోవైపు జనవరి 14న విడుదలైన మరో సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అనుపమ పరమేశ్వరన్ అందాలు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. మూడు రోజుల్లో ఈ సినిమాకు 2 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ 4 కోట్లకు పైగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాకు ఇకపై కలెక్షన్స్ రావడం సాధ్యం కాదు. ఓవరాల్‌గా ఎటు చూసుకున్న ఈ సంక్రాంతి విజేతగా బంగార్రాజు నిలిచాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మరో సెలబ్రెటీ కపుల్ బ్రేకప్.. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్
Siri Hanmanth | బిగ్‌బాస్ బ్యూటీ సిరికి కొవిడ్ పాజిటివ్
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

