హైదరాబాద్ : కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను నీడలా వెంటాడుతున్నది. ఇప్పటి వరకు ఎంతో మంది తారలకు వైరస్ సోకగా.. పలువురు కోలుకోగా.. మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతు సైతం కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షించింది. ఈ విషయాన్ని సిరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
స్వల్ప లక్షణాలు ఉండగా.. పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొంది. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల్లో నటించిన సిరి బిగ్‌బాస్ సీజన్- 5తో గుర్తింపును తెచ్చుకొని.. టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. బీబీ హౌస్‌లో ఆటకంటే షణ్ముఖ్ జస్వంత్‌తో రిలేషన్షిప్లో ఉందన్న రూమర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పింది. వీరిద్దరూ విడిపోయేందుకు కారణం సిరినే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. షన్ను- దీప్తి బ్రేకప్‌కి కారణం తాను కాదని స్పష్టం చేసింది.