మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..

Sai Pallavi | సాధారణంగా స్టార్ హీరోయిన్ హోదా వచ్చిన తర్వాత చెల్లి పాత్రల వైపు అస్సలు ఆసక్తి చూపించరు కొందరు ముద్దుగుమ్మలు. కానీ కథకు ప్రాముఖ్యత ఉంటే మాత్రం కొందరు హీరోయిన్లు సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి సరే అంటారు. తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉన్నా కూడా చెల్లి పాత్ర చేస్తామని అంటారు. కీర్తి సురేశ్ ఈ కోవలో అందరికంటే ముందు ఉంటుంది. మొన్న విడుదలైన రజినీకాంత్ పెద్దన్న సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి. తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు సాయి పల్లవి కూడా చెల్లెలి పాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సాయిపల్లవికి కూడా ఒక చెల్లి పాత్ర ఆఫర్ వచ్చింది. పైగా పారితోషికం కూడా రెండు కోట్లకుపైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. తమన్ మరోసారి త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది.
సినిమాలో అత్యంత కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు కూడా మీ చాయిస్ పర్ఫెక్ట్ అంటున్నాడు. అయితే సాయి పల్లవి ఈ పాత్రకు ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది వరకు చిరంజీవి సినిమాలో కీర్తి సురేశ్ కంటే ముందు ఆ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అడిగారు. భారీ పారితోషికం ఆఫర్ చేసినా కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. అయితే రీమేక్ సినిమాలు అంటే తనకు భయమని.. అందుకే భోళా శంకర్ సినిమాను ఒప్పుకోలేదని అప్పట్లో సాయిపల్లవి చెప్పింది. ఇప్పుడు మహేశ్ ది స్ట్రెయిట్ సినిమా కాబట్టి చెల్లెలిగా మారుతుందా లేదా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
ప్రయోగాల జోలికి వెళ్లకుండా మహేశ్ బాబు సేఫ్ జోన్లో ఉండటానికి అసలు కారణం అదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

