ప్రయోగాల జోలికి వెళ్లకుండా మహేశ్ బాబు సేఫ్ జోన్లో ఉండటానికి అసలు కారణం అదే..

Mahesh babu | తెలుగు ఇండస్ట్రీలో ఈ తరం హీరోల్లో ప్రయోగాలు చేయాలంటే అందరి కంటే ముందు ఉండే హీరో మహేశ్ బాబు. ఒకప్పుడు ఆయన చాలా ప్రయోగాలు చేశాడు. కానీ అవి బెడిసికొట్టడంతో ప్రయోగాలు వద్దని అనుకున్నాడు. మరీ ముఖ్యంగా కమర్షియల్ హీరో అయిన తర్వాత.. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకున్న తర్వాత ప్రయోగాల జోలికి అస్సలే వెళ్లట్లేదు. పూర్తిగా సేఫ్ జోన్లో ఉండే కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడో తాజాగా కారణాన్ని వివరించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు.

కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో నాని, నిజం వంటి విభిన్న కథలతో సినిమాలు చేశాడు. కానీ అవి బెడిసికొట్టాయి. ఆ తర్వాత చాలా ఏండ్లకు 1 నేనొక్కడినే అంటూ మరో ప్రయోగం చేశాడు. ఇలా ఎక్స్పరిమెంట్ చేసిన ప్రతిసారి అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. కానీ కమర్షియల్‌గా విజయం మాత్రం దక్కలేదు. దీంతో పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాడు మహేశ్ బాబు. హిట్స్‌లో ఉన్న దర్శకులతో పూర్తిగా కమర్షియల్ కథల వైపు మాత్రమే అడుగులు వేస్తున్నాడు. గత కొన్నేండ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేశ్ బాబు సీక్రెట్ కూడా అదే. 1 నేనొక్కడినే తర్వాత మహేశ్ బాబు సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మధ్యలో బ్రహ్మోత్సవం, స్పైడర్ మాత్రమే అంచనాలు అందుకోలేదు. కానీ శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వచ్చిన మహేశ్ తన సక్సెస్ సీక్రెట్‌తో పాటు చాలా విషయాల గురించి చర్చించాడు.
ముఖ్యంగా మీరు ఎందుకు ప్రయోగాలు చేయడం లేదని జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు.. నిర్మాతలను కష్టాల్లో పడేయలేను అని సింగిల్ ఆన్సర్ చెప్పాడు చెప్పాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత అభిమానులు ఏం కోరుకుంటున్నారో.. నిర్మాతలు ఎంత బడ్జెట్ పెడుతున్నారో చూసుకున్న తర్వాత ప్రయోగాలు చేయాలి అంటున్నాడు మహేశ్. అలా చేయకపోతే దారుణంగా నష్టపోతారని అన్నారు. తన కెరీర్లో ఇదే విషయాన్ని తెలుసుకున్నా అని.. అందుకు పూర్తిగా సేఫ్ జోన్లోనే ఉంటున్నానని సమాధానం చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రామ్ చరణ్, మహేశ్ బాబు కాంబినేషన్లో మల్టీస్టారర్
Mahesh Babu: ఏడాదికి మూడు వెకేషన్స్.. అది మహేష్‌తోనే సాధ్యమా?
NTR: వాళ్లను చూస్తే నాకు ఈర్ష్య.. మహేష్‌తో అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్
Mahesh Babu: తన సినిమాల్లో కూతురికి ఏం నచ్చదో చెప్పిన మహేష్ బాబు
Mahesh Babu: మహేష్ బాబుకి సర్జరీ.. కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- emk
- Mahesh babu
- NTR
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

