NTR: వాళ్లను చూస్తే నాకు ఈర్ష్య.. మహేష్‌తో అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్

బుల్లితెరతో పాటు వెండితెరపై రచ్చ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఎవరు మిలో కోటీశ్వరులు అనే షోకి హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ షోకి మహేష్ ఎపిసోడ్‌తో ముగింపు పడినట్టు తెలుస్తుంది. ఆదివారం రోజు ఎన్టీఆర్ షోలో మహేష్ సందడి చేయగా, ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు.
ఒకరినొకరు టీజ్ చేసుకోవడమే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. మహేష్ తన కూతురి గురించి చెబుతూ తనతో బాండింగ్ రోజు రోజుకు పెరుగుతుంది. సితారతో తండ్రిగా ప్రతి క్షణం ఆనందిస్తా అని అన్నాడు మహేష్. అయితే ఇందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. కూతుళ్లు ఉన్నవాళ్లను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని వెల్లడించారు. తనకు ఇద్దరూ మగపిల్లలు కావడంతో కూతురు లేకపోవడం కాస్త వెలితిగా అన్పిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.
ఓ ప్రశ్నలో భాగంగా మహాభారతంలో ఏ పాత్ర అంటే మీకిష్టమని, ఏ పాత్రని చేయాలనుకుంటున్నారని మహేష్‌ని.. ఎన్టీఆర్ ప్రశ్నించగా, అందులో అన్ని ముఖ్యమైన పాత్రలే అని, ఇప్పుడు దాన్ని తీయడం మామూలు విషయం కాదని తన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే మీకు కృష్ణుడి వేషం బాగా సూట్ అవుతుందని ఎన్టీఆర్ అనగా, చిన్న స్మైల్ ఇచ్చాడు మహేష్.
త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్నారుగా ఇక అన్ని ఆటలు ఆడిపిస్తారని తెలిపారు ఎన్టీఆర్. అన్ని ఆటలు సెట్లో చూపిస్తారని, ఆయన మామూలోడు కాదని స్వీట్‌గా హెచ్చరించాడు ఎన్టీఆర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

