Mahesh Babu: తన సినిమాల్లో కూతురికి ఏం నచ్చదో చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయం తప్పక కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పిల్లలతో కలిసి గేమ్స్ ఆడడం, సినిమాలు చూస్తూ చిల్ అవ్వడం వంటివి చేస్తుంటాడు. అయితే తన సినిమాలలో ఆయన పిల్లలు ఏమి ఇష్టపడరనే విషయాన్ని తాజాగా ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌ను ఒక హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా విలన్లతో ఫైట్ చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, దీనిపై మహేష్ స్పందిస్తూ “వాళ్లకు యాక్షన్ పార్ట్ నచ్చదు. ఫైట్ సన్నివేశం వచ్చినప్పుడల్లా బయటకు వెళతారు. ముఖ్యంగా నా కుమార్తె. సితార ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చూడటం అస్సలు ఇష్టపడదు. యాక్షన్ పార్ట్స్కాకుండా మిగతా సన్నివేశాలను నా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారూ” అంటూ చెప్పుకొచ్చారు మహేష్.
ప్రస్తుతం మహేష్ తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఇటీవల మహేష్ మోకాలికి గాయమైందని, ఈ క్రమంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతుందని చెప్పుకొచ్చారు. మరి ఇందులో ఎంత నిజముందనే దానిపై క్లారిటీ లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Mahesh babu
- Sitara
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

