రామ్ చరణ్, మహేశ్ బాబు కాంబినేషన్లో మల్టీస్టారర్

Ram charan and Mahesh babu multi starrer | తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలు పూర్తిగా మారిపోయారు.. కథ నచ్చితే చిన్న పాత్రలో నటించడానికి కూడా సిద్ధం అంటున్నారు. మరీ ముఖ్యంగా మల్టీస్టారర్ కథల వైపు అడుగులు బాగానే వేస్తున్నారు. ఒకప్పుడు ఒకే సినిమాలో ఇద్దరు హీరోలను కలిసి చూపించాలంటే దర్శకుల తలప్రాణం తోకలోకి వచ్చేది. ఎవరిని ఎలా చూపిస్తే ఎవరి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అర్థం కాక.. అలాంటి కథలు ఉన్నా కూడా వాటి జోలికి పోలేదు దర్శకులు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలతో పాటు అభిమానులు కూడా మారిపోయారు.
వాళ్లు కూడా మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే హీరోల అడుగులు అటు వైపు పడుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అధికారికంగా ప్రకటించిన తర్వాత చాలా మంది హీరోలు మనసు మార్చుకుని మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి విడుదల కానున్న బంగార్రాజు, ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ సినిమాలు మల్టీస్టారర్సే. ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు. తాజాగా మరో మల్టీస్టారర్ కూడా తెలుగు ఇండస్ట్రీలో రాబోతుందని తెలుస్తోంది.
రామ్ చరణ్, మహేశ్ బాబు హీరోలుగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ ఒక భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ దగ్గర మహేశ్ బాబు డేట్స్ ఉన్నాయి. మరోవైపు మేనమామ ఎప్పుడు డేట్స్ అడిగిన అల్లుడు రామ్ చరణ్ కాదనడు. ఇద్దరి కాంబినేషన్లో వంశీ పైడిపల్లి ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో మహేశ్ బాబుతో మహర్షి.. రామ్ చరణ్ తో ఎవడు సినిమాలు తెరకెక్కించాడు వంశీ. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరోవైపు తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా ఈ సూపర్ స్టార్స్ ఇద్దరినీ కలిపి సినిమా చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ వర్కవుట్ అయినా కూడా అభిమానులకు పండగే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ram Charan: మరదలితో స్టెప్పులు వేస్తూ రచ్చ చేసిన రామ్ చరణ్
Mahesh Babu: ఏడాదికి మూడు వెకేషన్స్.. అది మహేష్‌తోనే సాధ్యమా?
Upasana:ఉపాసన చెల్లెలి పెళ్లిలో స్టన్నింగ్ లుక్‌లో మెరిసిన చిరంజీవి, రామ్ చరణ్
RRR: ఈ రెండు ఫ్రేములు చాలు.. అభిమానుల ఆనందం రెట్టింపు కావడానికి..!
NTR: వాళ్లను చూస్తే నాకు ఈర్ష్య.. మహేష్‌తో అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్
Mahesh Babu: తన సినిమాల్లో కూతురికి ఏం నచ్చదో చెప్పిన మహేష్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

