Mahesh Babu: ఏడాదికి మూడు వెకేషన్స్.. అది మహేష్‌తోనే సాధ్యమా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ఫ్యామిలీని తీసుకొని టూర్స్‌కి వెళుతూ అక్కడ తెగ సందడి చేస్తుంటాడు. అయితే ఏడాదికి మూడు వెకేషన్స్ తప్పనిసరిగా వెళుతుంటాడట మహేష్. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
“ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఎన్టీఆర్, మహేష్.. సెలవులను ఎంజాయ్ చేయడం గురించి చర్చించుకున్నారు. కోవిడ్-19 భయాందోళనల మధ్య మహేష్ విహారయాత్రకు ఎలా వెళ్తాడోనని ఆందోళన చెందుతున్నానని ఎన్టీఆర్ జోక్ పేల్చారు. ఈ క్రమంలో మహేష్ …తన పిల్లలతో ఏడాదికి మూడు వెకేషన్స్ ప్లాన్ చేస్తానని వివరించాడు. “ఈ పర్యటనలు మా, మా పిల్లల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి” అని అన్నారు.
ఊటీ తన ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అని మహేష్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ గురించి ప్రశ్న వచ్చినప్పుడు తనకు క్రికెట్ అంటే ఇష్టమన్నారు మహేష్. చిన్నప్పుడు బాగా ఆడేవాడట. ఆ తర్వాత మానేశానని, ఇప్పుడు ఆడటం కుదరడం లేదన్నారు. బిర్యానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు తనకు తన అమ్మమ్మ చేసిన వంటలంటే ఇష్టమని, ఆమె చనిపోయాక ఆ ఊరి వంటల రుచులను మిస్ అవుతున్నానని తెలిపారు. అయితే హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

