Mahesh Babu: మహేష్ బాబుకి సర్జరీ.. కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏదైన గ్రహణం పట్టిందా అనే అనుమానం కలుగుతుంది.ఒకవైపు లెజండరీ నటులు అనారోగ్యంతో మరణిస్తుంటే మరోవైపు హీరోలు పలు సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం తర్వాత అడివి శేష్, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా పలువురు స్టార్స్ ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారనే వార్త ఆందోళన కలిగిస్తుంది.
సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మహేష్ మోకాలికి మైనర్ గాయం అయినట్టు తెలుస్తుండగా, దీనిపై మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.
దీంతో మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదని తెలుస్తుంది. సంక్రాంతికి రావలసిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ వలన ఏప్రిల్‌కి వెళ్లింది. ఇప్పుడు ఈ పరిస్థితులలో మళ్లీ చిత్ర విడుదల తేది మారుస్తారా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఇక మహేష్ బాబుకి సర్జరీ అని తెలిసి ఆయన అభిమానులు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ స్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

