Apsara rani | కోరిక తీరిస్తేనే ఛాన్స్ ఇస్తానన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ అయిన ఆర్జీవీ హీరోయిన్

Apsara rani | సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలామంది నోరువిప్పారు. అవకాశాలు కావాలంటే తాము చెప్పింది చేయాలని వేధింపులకు గురిచేశారని బయటకొచ్చి మరి ధైర్యంగా చెప్పుకొచ్చారు. దీనిపై మీటూ అంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. అయినప్పటికీ ఇంకా ఈ వేధింపులు ఆగడం లేదు. తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని ఇప్పటికీ ఎవరో ఒకరు నోరువిప్పుతూనే ఉన్నారు. తాజాగా ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది.
కెరీర్ మొదట్లో కన్నడ ఇండస్ట్రీలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది అప్సరరాణి. కన్నడలో ఒక సినిమాలో హీరోయిన్గా ఆఫర్ వచ్చిందని.. ఆ సినిమా డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రూంకి రమ్మన్నాడని చెప్పింది. తీరా అక్కడికి వెళ్లాక తన కోరిక తీరిస్తేనే సినిమాలో ఛాన్స్ ఇస్తానని బెదిరించాడని పేర్కొంది. కానీ తాను వాళ్ల నాన్నతో వెళ్లానని.. అక్కడి పరిస్థితి అర్థం కావడంతో పారిపోయి వచ్చేశామని చెప్పుకొచ్చింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం తనకు అలాంటి వేధింపులు ఎదురుకాలేదని స్పష్టం చేసింది అప్సర రాణి. టాలెంట్ ఉన్నవాళ్లకు తెలుగులో మంచి ఛాన్సులు వస్తాయని తెలిపింది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొంది.

రామ్‌గోపాల్ వర్మ థ్రిల్లర్‌తో గుర్తింపు తెచ్చుకుంది అప్సరరాణి. అప్పటివరకు అంకిత మహారాణగా ఉన్న ఆమె ఆర్జీవీ చేతిలో పడ్డాక అప్సర రాణిగా మారింది. ఇప్పుడు ఈమెతో డేంజరస్ అనే మూవీ కూడా తీస్తున్నాడు. ఇందులో నైనా గంగూలీ మరో హీరోయిన్. అప్సర రాణికి ఆర్జీవీ కేవలం సినిమా ఛాన్సులు ఇవ్వడమే కాదు కావాల్సినంత హైప్ కూడా ఇచ్చాడు. అప్పట్లో అప్సరతో కలిసి పలు పార్టీలకు కూడా వెళ్లాడు ఆర్జీవీ. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చరేపాయి. దీంతో అప్సర రాణి తొందరగానే పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. భూమ్ బద్దల్.. భూమ్ బద్దల్ అంటూ సాగే ఈ పాటలో అప్సర రాణి.. తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఆ సాంగ్‌కు వచ్చిన క్రేజ్‌తో గోపీచంద్ సీటీమార్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. పెప్సీ ఆంటీ అని సాగే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Apsara Rani: ఐటెం బాంబు అప్సర రాణి అందాలు
మరో సెలబ్రెటీ కపుల్ బ్రేకప్.. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్
Siri Hanmanth | బిగ్‌బాస్ బ్యూటీ సిరికి కొవిడ్ పాజిటివ్
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

