nitish bharadwaj | ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యకు దూరమైన బుల్లితెర కృష్ణుడు..

Nitish Bharadwaj Divorce | సినిమా ఇండస్ట్రీలో ఏమవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నో ఏండ్లు అన్యోన్యంగా కలిసి ఉన్న జంటలు ఉన్నట్టుండి విడిపోతున్నాయి. గత ఏడాది నాగచైతన్య, సమంత విడిపోయినప్పుడు ఎంతోమంది అభిమానులు బాధపడ్డారు. బాలీవుడ్లో 15 సంవత్సరాలు కలిసి ఉన్న అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకున్నారు. మొన్నటికి మొన్న తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా విడిపోయారు. ఈ ఇద్దరు విడిపోతారని అభిమానులు కలలో కూడా ఊహించలేదు. కానీ ఎవరూ ఊహించని ఈ విధంగా తమ విడాకుల విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ధనుష్. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకున్నారు.
బుల్లితెరపై శ్రీకృష్ణుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితీశ్ భరద్వాజ్.. తన భార్య స్మిత గేట్ కు విడాకులు ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో శ్రీ కృష్ణుడు పాత్రతో ఇండియన్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు నితీశ్ భరద్వాజ్. 58 ఏండ్ల ఈ నటుడు 2019 సెప్టెంబర్‌లో తన భార్య స్మితతో విడాకుల కోసం కోర్టులో అప్లై చేసుకున్నాడు. 2009లో ఈ ఇద్దరి పెండ్లి జరిగింది. ఈ జంటకు కవల పిల్లలు ఉన్నారు. వాళ్ల పేర్లు దేవయాని, శివరంజని. ప్రస్తుతం ఈ ఇద్దరు అమ్మాయిలు తల్లి దగ్గరే ఉన్నారు. తాము ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో కారణాలు చెప్పాలని లేదు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు నితీశ్ భరద్వాజ్. తాము తీసుకున్న నిర్ణయానికి కాస్త ప్రైవసీ కావాలి అంటున్నాడు. కాగా ఆయన భార్య ఒక ఐఏఎస్ అధికారిణి. ఈమెను 12 ఏండ్ల కింద రెండో పెళ్లి చేసుకున్నాడు నితీశ్. ఇప్పుడు ఇద్దరూ విడిపోవడంతో సోషల్ మీడియాలో వీళ్ల గురించి చర్చ జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా కుటుంబం అల్లుడిని దూరం పెట్టడానికి కారణం అదేనా..?
మరో సెలబ్రెటీ కపుల్ బ్రేకప్.. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్
NBK107 | బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు అదిరిపోయే టైటిల్..
ఇంట్లో నుంచి వెళ్లి నటి అదృశ్యం.. గోనె సంచిలో మృతదేహం లభ్యం
మీడియం రేంజ్ హీరోల్లో నాగ చైతన్యకు మాత్రమే సాధ్యమైన రికార్డు అది..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

