మీడియం రేంజ్ హీరోల్లో నాగ చైతన్యకు మాత్రమే సాధ్యమైన రికార్డు అది..

Naga chaitanya | తెలుగు ఇండస్ట్రీలో మూడు రకాల హీరోలు ఉంటారు. అందులో పెద్ద హీరోలు, మీడియం రేంజ్, చిన్న హీరోలు అంటూ ఎవరికి వాళ్లకే సపరేట్ మార్కెట్ ఉంటుంది. వాళ్ల వాళ్ల మార్కెట్‌కు తగ్గట్లు నిర్మాతలు సినిమాలు చేస్తూ ఉంటారు. సెకండ్ టైర్ హీరోలలో నాని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రవితేజ, అఖిల్ అక్కినేని, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్లాంటి వాళ్లు ఉంటారు. వీళ్ల మార్కెట్ రూ.25 నుంచి రూ.40 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ హీరోల సినిమాలు విజయం సాధిస్తే కచ్చితంగా 30 కోట్ల షేర్ అందుకుంటాయి.ఇప్పుడు ఈ సెకండ్ టైర్ హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ కోసం నాగ చైతన్య పోటీ పడుతున్నాడు. దీనికి తగ్గట్లుగా గత కొన్ని ఏళ్లుగా ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది.
గత రెండేళ్లుగా నాగ చైతన్య నటిస్తున్న సినిమాలు రూ.50 కోట్ల కంటే ఎక్కువగా గ్రాస్ వసూలు చేస్తున్నాయి. అలా నాగచైతన్య నటించిన నాలుగు సినిమాలు వరుసగా 50 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. అదులో రెండు సినిమాలు మల్టీస్టారర్స్ కావడం గమనార్హం. తండ్రి నాగార్జున, మామ వెంకటేశ్‌తో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. మీడియం రేంజ్ హీరోలలో వరుసగా నాలుగు సార్లు రూ.50 కోట్ల గ్రాస్ అందుకున్న రికార్డు ఎవరికీ లేదు. అది సాధించిన ఒకే ఒక్క హీరో నాగచైతన్య. 2019లో సమంత జంటగా నటించిన మజిలీ రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే ఏడాది డిసెంబర్లో విడుదలైన వెంకీమామ రూ.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక గతేడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నటించిన లవ్ స్టోరీ సినిమా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. సాయి పల్లవి నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక మొన్న సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో 50 కోట్లు అంతకంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన ఏకైక సెకండ్ టైర్ హీరోగా నాగ చైతన్య చరిత్ర సృష్టించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
బంగార్రాజు సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.. కలెక్షన్స్ డ్రాప్..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
ఇంట్లో నుంచి వెళ్లి నటి అదృశ్యం.. గోనె సంచిలో మృతదేహం లభ్యం
Krithi Shetty | పింక్ కలర్ లంగా ఓణీలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

