NBK107 | అఖండ సినిమా సంచలన విజయం సాధించడంతో బాలకృష్ణ జోరుమీదున్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు నందమూరి నటసింహం. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు బాలకృష్ణ. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న కూడా.. కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు బాలకృష్ణ. దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఇదే విషయం చెప్పాడు బాలయ్య. తనతో సినిమా అంటే ఆరు నెలల్లో ముగించాలి అంటున్నాడు.
వేటపాలెం నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కుతుంది. రవితేజ క్రాక్ సినిమాలోనే వేటపాలెం నేపథ్యం ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాలు పూర్తి స్థాయిలో అక్కడే తెరకెక్కించబోతున్నాడు గోపీచంద్ మలినేని. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తమన్ మరోసారి బాలకృష్ణ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారు.
బాలకృష్ణ ఇమేజ్‌కు సరిపోయేలా దీనికి పెద్దాయన అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. 25 ఏళ్ల కింద పెద్దన్నయ్య పేరుతో ఒక సినిమా చేశాడు బాలయ్య. అది బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కాస్త అటు ఇటుగా పెద్దాయన పేరుతో సినిమా రానుందని తెలుస్తోంది. బాలకృష్ణ ఇమేజ్‌కు కూడా ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న సినిమా ఇదే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
NBK107 నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?
పాన్ ఇండియన్ దండయాత్రకు సిద్ధమవుతున్న బాలకృష్ణ
ఆ ఒక్క సీన్ నచ్చలేదని సమరసింహారెడ్డిలో ఛాన్స్ వదులుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?
సంకాంత్రి సంబరాల్లో గుర్రం ఎక్కి సందడి చేసిన బాలకృష్ణ..