మెగా కుటుంబం అల్లుడిని దూరం పెట్టడానికి కారణం అదేనా..?

Kalyan dev | ఎందుకో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తుంది. మొన్నటికి మొన్న సమంత, నాగచైతన్య విడిపోయారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా విడాకులు తీసుకున్నారు. నిన్నటికి నిన్న ఎవరూ ఊహించని విధంగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 18 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత విడిపోయారు. ఇది నిజంగా ఎవరూ ఊహించలేదు. అప్పటి వరకు కలిసినట్లే ఉన్న జంట ఒక్కసారిగా విడిపోవడం ఎవరికీ రుచించడం లేదు. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా విడాకుల పర్వం కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. అది కూడా మెగా కుటుంబంలోనే ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.
చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏ మాత్రం సయోధ్య కుదరడం లేదని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఉండదని కోరుకుంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు శ్రీజ తన పేరు నుంచి కళ్యాణ్ తీసేయడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు కేవలం ఈ కారణంగానే మొన్న విడుదలైన కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాను మెగా హీరోలు అసలు ప్రమోట్ చేయలేదు.
అంతేకాదు గత కొద్ది రోజులుగా కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబంతో దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న అందరూ కలిసి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. అందులో శ్రీజ ఉంది కానీ కళ్యాణ్ లేడు. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో ఉండటంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం భారీగానే జరుగుతుంది. శిరీష్ భరద్వాజ్ తో విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. ఈ జంటకు ఒక పాప ఉంది. దానికి ముందే శ్రీజకు మరో అమ్మాయి ఉంది. మరి కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజ విడిపోతుందనే వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది త్వరలోనే తేలనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
మెగా అల్లుడిని కనీసం పట్టించుకోవడం లేదుగా.. సూపర్ మచ్చికి డెఫిషీట్స్
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఆచార్య’ విడుదల తేదీ ప్రకటన..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

