naga chaitanya and krithi shetty | నాగ చైతన్యకు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ రొమాంటిక్ యాంగిల్ తెలియకుండానే అతని బ్లడ్ లో ఉంటుంది. తన సినిమాలు తను చేసుకుంటూ ఉండే నాగచైతన్యలో ఎప్పుడూ లేని రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు బయటకు వస్తోంది. సినిమాలలో మాత్రమే కాదు.. బయట కూడా అలాగే కనిపిస్తున్నాడు చైతూ. మొన్నటికి మొన్న బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ దక్ష నరార్కర్ ను అదోరకంగా చూస్తూ కొంటెగా నవ్వేశాడు. ఆ అమ్మాయి కూడా అదే రకంగా రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అమ్మో నాగ చైతన్య మామూలోడు కాదు కళ్ళతోనే మాయ చేస్తున్నాడు అంటూ క్యాప్షన్స్ కూడా పెట్టారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ కృతి శెట్టితో కూడా ఇలాగే మ్యాజిక్ చేశాడు నాగ చైతన్య. ఈ మధ్యే విడుదలైన బంగార్రాజు సినిమాలో జంటగా నటించారు చైతూ, కృతి. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా బంగార్రాజు సక్సెస్ మీట్ లో స్టేజ్ పై అందరూ చూస్తుండగా.. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ కొంటెగా నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. ఇద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తోంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మెల్లమెల్లగా తండ్రి నాగార్జున రొమాంటిక్ ఇమేజ్ తీసుకుంటున్నాడు చైతన్య.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
రంగంలోకి దిగిన రజినీ, కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలవబోతున్నారా!
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..