Lavanya Tripathi | తన పెళ్లి గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలపై కథానాయిక లావణ్యత్రిపాఠి పరోక్షంగా స్పందించింది. అందరు అనుకుంటున్నట్లు తాను బెంగళూరులో లేనని..సొంత పట్టణం డెహ్రాడూన్‌లో కుటుంబ సభ్యులతో ఉన్నానని ఫొటోల ద్వారా స్పష్టం చేసింది.
ఇంతకి ఈ భామ పెళ్లి పుకార్లకు కారణమేమిటంటే…యువ హీరో వరుణ్‌తేజ్‌తో లావణ్య త్రిపాఠి రెండు చిత్రాల్లో కలిసి నటించింది. దాంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే గుసగుసలు వినిపించసాగాయి. వరుణ్‌తేజ్ సోదరి నిహారిక పెళ్లికి కూడా లావణ్యత్రిపాఠి హాజరుకావడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరినైట్లెంది. ఇదిలావుండగా ఇటీవల వరుణ్‌తేజ్ పుట్టినరోజు వేడుకల కోసం బెంగళూరు వెళ్లాడు. లావణ్యత్రిపాఠితో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకే ఆయన బెంగళూరు వెళ్లాడని సోషల్‌మీడియాలో గాసిప్స్ వచ్చాయి. వీటికి పరోక్షంగా సమాధానమిస్తూ తాను ఫ్యామిలీతో డెహ్రాడూన్‌లో గడుపుతున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది లావణ్యత్రిపాఠి. దాంతో ఈ భామ పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పడ్డట్లయిందని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..