ఎక్కడి ధాన్యం అక్కడే!
కాంగ్రెస్ పాలనలో రైతులకు వరుస కష్టాలు తప్పడంలేదు. నిన్నమొన్నటి వరకూ ప్రభు త్వ నిర్లక్ష్యంతో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రం గా నష్టపోయారు. ఇప్పుడు కనీసం ఆ మిగిలిన పంట ను అమ్ముకుందామంటే కొనుగోలు చేసే దిక్కులేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నాయి.
- కరువుకు తోడు కనికరం లేని సర్కార్.. పత్తాలేని వడ్ల కాంటాలు
- సిండికేట్‌గా మిల్లర్లు, వ్యాపారులు
- మార్కెట్లో పడిపోయిన వడ్ల ధరలు
- సర్కార్ కాంటా పెట్టకపోవడంతో
- అగ్గువకే వ్యాపారుల బేరసారాలు
- ప్రభుత్వ స్పందన కోసం రైతుల చూపు
- కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు
- కొనుగోలు లక్ష్యం 65 లక్షల టన్నులు
- ఇప్పటికి కొన్నది 50 వేల టన్నులే
- సర్కార్ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రైతులకు వరుస కష్టాలు తప్పడంలేదు. నిన్నమొన్నటి వరకూ ప్రభు త్వ నిర్లక్ష్యంతో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రం గా నష్టపోయారు. ఇప్పుడు కనీసం ఆ మిగిలిన పంట ను అమ్ముకుందామంటే కొనుగోలు చేసే దిక్కులేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నాయి.
ధాన్యం కల్లాలకు చేరుతున్నది. అయినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. ప్రకటనలు తప్ప గ్రామాల్లో కాంటా పెట్టడంలేదు. ధాన్యం జోకడం లేదు. ఎక్కడో ఒకచోట కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లు ప్రారంభించామని ప్రకటిస్తున్నారే తప్ప కొనుగోళ్లు మాత్రం చేయడంలేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకూ పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. సిండికేట్‌గా మారి ధాన్యం ధరలను తగ్గించేశారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
కనీసం ప్రభుత్వ కేంద్రాల్లోనైనా విక్రయిద్దామంటే ప్రభు త్వం ఇకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా ఒకవైపు మార్కెట్లో ధరలు తగ్గి, ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులపై తుపాన్లు, అకాల వర్షాల రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తున్నది. ఈ వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ఎండిన ధాన్యం ఎక్కడ వర్షార్పణం అవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, ధా న్యం కొనుగోళ్లపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంటా లేదు.. జోకుడు లేదు
వానకాలంలో 57.7 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 120 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. రూ.18,250 కోట్లతో 65 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికలు రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ కేంద్రాలు అక్టోబర్ 1వ తేదీ నాటికే గ్రా మాల్లో సిద్ధంగా ఉంటాయని చెప్పారు. మంత్రి చెప్పిన ప్రకారం ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలన్నర రోజులు కావాలి. కానీ ఇప్పటివరకూ వందలోపు కేంద్రాలను మాత్రమే ప్రారంభించినట్టు తెలిసింది. వీటిని కూడా కొబ్బరికాయ కొట్టి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ కేంద్రంలో ధాన్యం కాంటా పెట్టిందీ లేదు. సంచి ఎత్తిందీ లేదని రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

మిల్లర్ల సిండికేట్.. ధర ఢమాల్
నిన్నమొన్నటి వరకూ వ్యాపారులు, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. పొలాల వద్దకు వెళ్లి మరీ అడ్వాన్స్‌లు ఇచ్చారు. వడ్లకు మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 ఉండగా, సాధారణ రకానికి రూ.2,441 ఉన్నది. ఒక దశలో సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.5వేల వరకు ధర పలికింది. దొడ్డు ధాన్యం సైతం రూ.2,800 వరకు ధర పలికింది. అది కూడా పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేశారు. ఇలా సుమారు 20 రోజులపాటు వ్యాపారులు, మిల్లర్లు హడావుడి చేశారు. మార్కెట్లకు ధాన్యం ఎక్కువగా రావడం మొదలుకాగానే వ్యాపారులంతా సిండికేట్‌గా మారిపోయారు.
ఒకేసారి ధాన్యం ధరలను తగ్గించేశారు. ప్రస్తుతం దొడ్డు ధాన్యానికి రూ.2 వేలకు మించి పెట్టడం లేదు. సన్నరకం ధాన్యానికి కూడా రూ.2,800-రూ.3,000కు మించి ఇవ్వడం లేదు. ‘ఇష్టముంటే ఇవ్వండి.. లేదంటే ప్రభుత్వానికి అమ్ముకోండి ’అంటూ వ్యాపారులు రైతులకు తెగేసి చెప్తున్నారు. ఇలా కేవలం వారం రోజుల్లో ఏకంగా క్వింటాల్‌కు రూ.వెయ్యి వరకు ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, వ్యాపారుల సిండికేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కావాలనే ధర తగ్గిస్తూ, ధాన్యం కొనుగోలు చేయకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు పలుచోట్ల మిల్లర్లు, వ్యాపారులకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తే దొడ్డు ధాన్యానికి మద్దతు ధరతోపాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా వస్తుందని రైతులు ఆశపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తుందో స్పష్టత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు కరువు.. మరోవైపు సర్కార్ కక్ష
ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేస్తే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికే ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా, చెరువులు నింపకుండా సాగునీళ్ల గోస తెచ్చిందనే ఆరోపణలున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో విద్యుత్తు ఉత్పత్తిలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి విద్యుత్తు సంక్షోభం, కరెంట్ కోతలకు కారణమైందనే ఆరోపణలున్నాయి. కరువుతో రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ తేల్చింది. పంట నష్టం విలువ సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని లెక్క తేల్చింది. రైతులు ఇంత తీవ్రస్థాయిలో ఆర్థికంగా నష్టపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలున్నాయి. ఇప్పటివరకూ రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీపై ఊసెత్తడంలేదు. నయా పైసా సహాయం చేయలేదు. పంట నష్టం నేపథ్యంలో ప్రభుత్వం కొంతైనా పరిహారం అందిస్తే రైతులకు ఊరట లభించేది.
పొంచి ఉన్న వర్షం ముప్పు
రైతులంతా వరి కోతలు కోసి కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంతో రైతులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. రైతులకు మరో కొత్త టెన్షన్ పట్టుకున్నది. ఇప్పటికే మురసు తుపాను రూపంలో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. ఇప్పుడు మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వర్షం కురిస్తే ధాన్యం కొట్టుకుపోవడం, తడిసిపోయే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ముందుగానే విక్రయించి వర్షం నష్టం నుంచి తప్పించుకోవచ్చని రైతులు ఆశ పడుతున్నారు. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

