సుమంత్ రెండో పెళ్లి | అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో వైరల్‌గా మారింది. పవిత్ర అనే అమ్మాయిని ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ఒక పెళ్లి కార్డు కూడా ప్రత్యక్షమైంది. SP పేరుతో ఈ పత్రిక ఉండటంతో నిజంగానే సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఆర్జీవీ సైతం సుమంత్ రెండో పెళ్లి విషయంపై స్పందించాడు. ఒక్కసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ది రాలేదా సుమంత్… నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి అంటూ ఘాటుగా స్పందించాడు. పెళ్లి మానుకోమని హితబోధ కూడా చేశాడు. దీనికి సుమంత కూడా అదే స్టైల్లో రెస్పాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరిపై మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇటీవల సుమంత్ పెళ్లి గురించి పెద్ద చర్చే మొదలైంది. 2004 నటి కీర్తిరెడ్డితో సుమంత్ వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల లోపే విడాకులు తీసుకున్నారు. దీంతో చాలా రోజులుగా ఒంటరిగా ఉన్న ఈయన.. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరుగనున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సుమంత్ రెండో పెళ్లి వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ” ఒక పెళ్లే నూరేళ్ల పెంట అయితే.. రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి.. నా మాట విని మానేయ్యి.. పవిత్ర గారు, మీ జీవితాల్ని పాడు చేసుకోకండి.. తప్పు మీది కాదు సుమంత్‌ది గాదు.. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో సుమంత్‌ని ట్యాగ్ చేశాడు.
ఆర్జీవీ ట్వీట్‌పై స్పందించిన సుమంత్.. తన రెండో పెళ్లి వార్తలను కొట్టిపారేశాడు. విడాకుల నేపథ్యంలో ఒక సినిమాలో నటిస్తున్నానని.. ఆ సినిమాలోని స్టిల్ ఒకటి లీక్ కావడంతో ఈ పుకార్లు మొదలయ్యాయని క్లారిటీ ఇచ్చాడు. అంతేతప్ప రియల్ లైఫ్‌లో తాను పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా తన మీద చూపిన అభిమానానికి ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపాడు.
Oh okkkk Sir, I thank both God and Dévíl for u clearing the air that it’s for a film ..I wish everyone will see the film #MalliModalaindi and learn the hard facts about Marriages which incidentally are MADE IN HELL https://t.co/rumS6scdqd
— Ram Gopal Varma (@RGVzoomin) July 30, 2021
దీంతో ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. రెండో పెళ్లిపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చినందుకు నీ తరఫున దేవుడు, దెయ్యాలకు నా థ్యాంక్స్. అందరూ మళ్లీ మొదలైంది సినిమా చూడాలని కోరుకుంటున్నా.. అని రిప్లై ఇచ్చాడు. పెళ్లిళ్లు నరకంలో నిర్ణయించబడతాయని అన్న ఆర్జీవీ.. పెళ్లి గురించి నమ్మలేని సత్యాలను ఈ సినిమా చూసి తెలుసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు