లాక్డౌన్ వలన దాదాపు అన్ని రంగాలు స్తంభించాయి. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పూట గడవడం కూడా కష్టం అన్నట్టుగా ఉంది. స్టార్ హీరోలు సైతం కరోనా వలన షూటింగ్స్ మానేసి ఇంటికే పరిమితం అయ్యారు. కాని సుమ మాత్రం ఇంట్లో ఉండి కూడా బాగానే సంపాదిస్తుంది.గత ఏడాది సుమక్క అంటూ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి దానిని ఇతర సెలబ్రిటీలతో బాగా ప్రమోట్ చేసుకున్నారు.
ఇక సుమ ఈ మధ్య ఇంట్లోనే ఉంటూ కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేశారు. అంబాసిడర్గా తన పని తాను చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇడ్లీ దీనోత్సవం అంటూ సుమ ఓ వీడియోను షేర్ చేశారు. ఓ కంపెనీ వాళ్లు చేసిన స్పెషల్ ప్రొడక్ట్లను ప్రమోట్ చేసింది సుమ. పుట్నాల పొడి, కారం పొడి తనకు ఎంతో ఇష్టమైన చల్ల మిరపకాయలు ఈ కంపెనీ తయారు చేసే ప్రాడక్ట్స్లలో ఉన్నాయని తెలిపింది సుమ. ఏదేమైనా కూడా లాక్డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఉండి బాగానే సంపాదిస్తుంది సుమ.