Mandaadi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సుహాస్. ఈ టాటెంటెడ్ యాక్టర్ మండాడి (Mandaadi) సినిమాతో కోలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. కథను నమ్మి సినిమా చేసే సుహాస్ ఇక తమిళంలో కూడా తన లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ సూరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ పూర్తయింది. జెట్స్పీడ్తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలెంజింగ్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయిందని తెలిపారు మేకర్స్. సినిమా రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట, మూవీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
సుహాస్, సూరి టీంపై వచ్చే హై ఇంటెన్సిటీతో సముద్రంలో సాగే యాక్షన్ పార్ట్‌తోపాటు సెయిల్ బోట్ రేస్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందంటూ అప్డేట్స్ కూడా వచ్చాయి. ఈ సీక్వెన్స్ కోసం సూరి, సుహాస్ టీం ప్రత్యేకంగా ఆరు నెలలపాటు కఠిన శిక్షణ పొందారని ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీకోసంసుహాస్వందరోజులను కేటాయించాడు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించగా.. ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, మానవ స్ఫూర్తి లాంటి థీమ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్పొటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
The ship has sailed… carrying a storm of adrenaline your way ⛵🔥#MANDAADI SHOOT WRAPPED 🎬
A glimpse into the scale, the grit, and a team that pushed beyond blood, sweat & limits.
▶️ : https://t.co/L8Mj38oDsH@sooriofficial @ActorSuhas @elredkumar #VetriMaaran… pic.twitter.com/7HHcZv2HkH
— BA Raju’s Team (@baraju_SuperHit) April 24, 2026
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!