Mandaadi | కలర్‌ఫొటో సినిమాతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యువ నటుడు సుహాస్. కథను నమ్మి సినిమా చేసే యాక్టర్లలో ఒకడు సుహాస్. సినిమా సినిమాకు ఏదో ఒక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు. ఇప్పటిదాకా తెలుగు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుహాస్ ఇక తమిళంలో కూడా తనెంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. సుహాస్ నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి(Mandaadi). సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోంది.
కోలీవుడ్ యాక్టర్ లీడ్ సూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సుహాస్ వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు. నేడు సుహాస్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. సుహాస్ లాంగ్ హెయిర్, గడ్డంతో వెనక్కి చేతులు కట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో పడవను చూడొచ్చు. మొత్తానికి ఈ సారి మాత్రం ఏదో గట్టి ప్లానే వేశారని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రానికి పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తోంది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, మానవ స్ఫూర్తి లాంటి థీమ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఆర్ఎస్ ఇన్పొటైన్మెంట్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ విడుదలపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
Team #Mandaadi wishes the most talented and versatile #Suhas a Very Happy Birthday 💐
Get ready to witness his whole new fierce avatar on the Big Screens soon🔥#HBDSuhas ✨@sooriofficial @elredkumar @rsinfotainment #VetriMaaran @MathiMaaran @gvprakash @Mahima_Nambiar… pic.twitter.com/QO8c77IDC1
— RS Infotainment (@rsinfotainment) August 19, 2025
Coolie | తగ్గేదే లే అంటోన్న తలైవా.. బాక్సాఫీస్ వద్ద లోకేశ్ కనగరాజ్ కూలీ ఊచకోత
Toxic | యశ్ టాక్సిక్‌లో మరో భామ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?