గజ్వేల్, మార్చి 8: మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు అని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ చందన, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, మహిళా కౌన్సిలర్లు రూప, గోలి మమత, భాగ్యలక్ష్మి, భవాని, స్వప్న, కప్ప మమతతో పాటు పలువురిని ఆయన శాలువాలతో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుందని విమ ర్శించారు.
కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎగవేసింది, మహిళలకు స్కూటీలు ఇవ్వలేదని, అర్హులైన వారికి నెలకు రూ.2500, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తామని రెండున్నరేండ్లు గడుస్తున్నా అబద్ధపు మాటలతో కాలం గడుపుతుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, మహిళలు ఇబ్బంది పడకూడనే ఉద్దేశంలో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్, గర్భిణులకు పౌష్టికాహారం న్యూట్రిషన్కిట్, యవతుల కోసం గురుకుల డిగ్రీ కళాశాలలు, పాఠశాలలు నెలకొల్పారన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే మహిళల పాత్ర అత్యంత కీలకమని, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.