Toxic | కేజీఎఫ్ ప్రాంఛైజీతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ డమ్ కొట్టేశాడు కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash). ఈ టాలెంటెడ్ యాక్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తోన్న చిత్రం టాక్సిక్ (Toxic). A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్నఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు.
నయనతార, కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే యశ్ టీంలో మరో భామ జాయిన్ అయిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? రుక్మిణి వసంత్. టాక్సిక్‌లో రుక్మిణి వసంత్‌ను కీ రోల్ కోసం తీసుకున్నారని ఇప్పటికే ఆమెకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయని ఆసక్తికర వార్త సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. రుక్మిణి వసంత్ ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటైన కాంతార చాఫ్టర్ 1లో నటించే అవకాశం కొట్టేసిందని తెలిసిందే.
అంతేకాదు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రాజెక్ట్‌లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తోన్న మదరాసిలో కూడా మెరువనుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ స్టార్ యాక్టర్ల సినిమాల్లో నటించే అవకాశం కొట్టేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు హ్యూమా ఖురేషి, టారా సుటారియా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.