Sudheerbabu As Arjun prasad | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. మొదటి నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న సుధీర్ బాబుకు ‘సమ్మోహనం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్ర ఆశించిన స్థాయిలో రాలేకపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘హాంట్’ ఒకటి. ఈ సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన మ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో సుధీర్ బాబు చేతిలో సిగరెట్ పట్టుకుని ఇంటెన్సీవ్ కళ్ళతో చూస్తున్నాడు. క్లాస్ లుక్‌లో సుధీర్ బాబు పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు అర్జున్ ప్రసాద్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ అనౌన్స్‌మెంట్‌ను శనివారం సాయంత్రం వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Also:
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?