KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
KTR | 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో గెలిచేందుకు రాహుల్ గాంధీ 420 వాగ్ధానాలు చేశారు. వీటిలో 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లున్నాయి.. వీటిని 100 రోజుల్లోగా నెరవేర్చాల్సి ఉంది.. కానీ 1,000 రోజులు గడిచినా ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | రాహుల్ గాంధీ భారతదేశంలోనే అతిపెద్ద అబద్ధాలకోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిబ్రాన్ షరీఫ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో గెలిచేందుకు రాహుల్ గాంధీ 420 వాగ్ధానాలు చేశారు. వీటిలో 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లున్నాయి.. వీటిని 100 రోజుల్లోగా నెరవేర్చాల్సి ఉంది.. కానీ 1,000 రోజులు గడిచినా ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు రావడానికి భయపడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ ఒక ఏటీఎం లాగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ఒక కార్డులాగా పనిచేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును దోచుకుంటోందని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, కార్తకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
LIVE: వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు జిబ్రాన్ గారు.
📍 తెలంగాణ భవన్ https://t.co/QexaNc9HcA
— BRS Party (@BRSparty) October 25, 2026
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

