Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో అసమానత ఏర్పడే కర్ణిక దడ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్ - ఏఎఫ్ఐబీ) సమస్య వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.
Atrial Fibrillation | వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో అసమానత ఏర్పడే కర్ణిక దడ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్ – ఏఎఫ్ఐబీ) సమస్య వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌లో దాదాపు 79 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. అయితే వయసు పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ సమస్య వస్తుందని భావించకూడదు. దీని లక్షణాలు, కారణాలు, ప్రమాద కారకాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కర్ణికల్లో అస్తవ్యస్త సంకేతాలు ఏర్పడితే..
సాధారణంగా గుండె క్రమబద్ధమైన లయలో కొట్టుకుంటుంది. అయితే కర్ణిక దడ సమస్యలో గుండెలోని పై గదులైన కర్ణికల్లో విద్యుత్ సంకేతాలు అస్తవ్యస్తంగా ఏర్పడతాయి. సాధారణంగా విశ్రాంతి సమయంలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ సమస్య ఉన్నప్పుడు కర్ణికల్లో నిమిషానికి 450 నుంచి 600 వరకు విద్యుత్ ప్రేరణలు ఏర్పడతాయి. వీటిలో అన్నీ గుండె దిగువ గదులకు చేరవు. దీంతో గుండె కొట్టుకునే వేగం, లయలో మార్పులు కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ గుండె కండరాలు గట్టిపడడం, కర్ణికలు సాగి పెద్దవవడం, వాటిలో మచ్చ కణజాలం పేరుకుపోవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇవి గుండె విద్యుత్ సంకేతాల క్రమాన్ని దెబ్బతీసి అసాధారణ లయకు కారణమవుతాయి. 60 ఏళ్ల వయసులో సుమారు 3 నుంచి 4 శాతం మందికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉండగా, 80 ఏళ్ల వయసులో ఈ సంఖ్య సుమారు 8 శాతానికి చేరవచ్చని అంచనా.
లక్షణాలు ఎలా ఉంటాయి..
ఈ సమస్య ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకోవడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడుస్తున్నప్పుడు తూలుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. వృద్ధుల్లో అలసట, ఆయాసాన్ని వయసు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరం. సాధారణ గుండె లయతో పోలిస్తే కర్ణిక దడ ఉన్నవారికి పక్షవాతం వచ్చే ప్రమాదం మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో పక్షవాతం లేదా గుండె వైఫల్యం వచ్చిన తర్వాతే ఈ సమస్య బయటపడే అవకాశం ఉంటుంది. మధుమేహం, దీర్ఘకాలిక అధిక రక్తపోటు, గుండె ధమనుల వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, నిద్రలో శ్వాసకు అంతరాయం కలిగించే స్లీప్ అప్నియా వంటి పరిస్థితులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా మద్యం సేవించడం, పొగతాగడం, పొగాకు వినియోగం కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.
ఈసీజీ చేయించాలి..
గుండె కొట్టుకునే లయలో అసాధారణమైన లేదా నిరంతర మార్పులు కనిపిస్తే వాటిని వృద్ధాప్యంలో సహజంగా వచ్చే మార్పులుగా భావించకుండా వైద్యులను సంప్రదించాలి. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి కొన్ని రోజులపాటు గుండె లయను పర్యవేక్షించే హోల్టర్ మానిటర్ లేదా లూప్ రికార్డర్ వంటి పరికరాలను ఉపయోగించవచ్చు. ఎంపిక చేసిన రోగుల్లో శరీరంలో అమర్చే లూప్ రికార్డర్ ద్వారా మూడు నుంచి ఐదు సంవత్సరాలపాటు గుండె లయను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా సాధన, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అసాధారణ లక్షణాలను తొలిదశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తగిన చికిత్స, నిర్వహణకు మార్గం సుగమమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

