Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
Suicide | నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామానికి చెందిన అనిత తండ్రి హన్మంతు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తండ్రి లేకపోవడంతో తనను ఇక చదివించిలేననిపెళ్లి చేస్తానని తన తల్లి చెప్పినా అనిత మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పడంతో.. అనితను ఆమె తల్లి కూలీ పనులు చేసి చదివిస్తోంది.
Suicide | యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామానికి చెందిన హన్మంతు–వెంకటమ్మ దంపతులు తమ కూతురు అనిత (23)ని హైదరాబాద్‌లో డిగ్రీ చదివించారు. గత ఏడాది అనిత తండ్రి హన్మంతు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అనిత పీజీ చేసేందుకు అప్లై చేసింది.
కానీ తండ్రి లేకపోవడంతో తనను ఇక చదివించిలేననిపెళ్లి చేస్తానని తన తల్లి చెప్పినా అనిత మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పడంతో.. అనితను ఆమె తల్లి కూలీ పనులు చేసి చదివిస్తోంది. అయితే ఈ క్రమంలో అనిత మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనిత సన్నిహితంగా ఉండేదని, అతను పెళ్లి చేసుకోమని వేధించడంతో అతన్ని దూరం పెట్టి చదువుకుంటుందని.. కానీ దూరం పెట్టినప్పటికీ అనిల్ వేధింపులు ఆగకపోవడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని అనిత ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు పేర్కొన్నారు.
ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పి మధ్యలో నన్ను వదిలేసి వెళ్లిపోయావా బిడ్డా అంటూ అనిత మృతదేహం వద్ద ఆమె తల్లి గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అనిత తల్లి ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Girl
- narayanapeta
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

