‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా...
– NALOGS, RSSDI వైద్యులు
– ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నల్లగొండలో ఉచిత వైద్య శిబిరం
నల్లగొండ, నవంబర్ 14 : మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నల్లగొండ ప్రసూతి, స్త్రీ వైద్యుల సంఘం (NALOGS), భారత్ మధుమేహ అధ్యయన పరిశోధనా సంఘం (RSSDI) వైద్యుల సహకారంతో శనివారం నల్లగొండ రైల్వే స్టేషన్ ఆడిటోరియంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NALOGS అధ్యక్షురాలు డాక్టర్ వాసంత కుమారి నాయకత్వం వహించగా, కార్యదర్శి డాక్టర్ రాజేశ్వరి, కోశాధికారి డాక్టర్ లీలావతి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ విశ్వజ్యోతి పాల్గొన్నారు. RSSDI వైద్యులు డాక్టర్ మత్రు నాయక్, డాక్టర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ వితల్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.
ఈ శిబిరంలో మొత్తం 95 మందికి ఉచితంగా రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు (BP), థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్యుల సూచన మేరకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వేదికను అందించిన రైల్వే శాఖ అధికారులకు డాక్టర్ వాసంత కుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రమణారెడ్డి, వారి బృందం, రాంబాబు, ల్యాబ్ టెక్నీషియన్లు అనూష, ఇతర సిబ్బంది అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో మధుమేహంపై అవగాహన పెంపొందించడం, వ్యాధిని ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం NALOGS, RSSDI తమ సేవలను కొనసాగిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Diabetes
- Nalgonda News
- NALOGS
- RSSDI
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

